Road construction | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

Road construction | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

Road construction | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామ సర్పంచ్ గా తనను గెలిపిస్తే సూర్య తండాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంజూరు అయి వున్న రోడ్డు నిర్మాణ(Road construction) పనులను తాజా మాజీ జడ్పీటీసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే చేయించేందుకు కృషి చేస్తానని బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీరామ్ సత్యనరాయణ అన్నారు.

గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల(infrastructure) కల్పనకు ఎలాంటి లోటు రాకుండా నిత్యం గ్రామంలోనే వుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తనతో పాటు అన్ని వార్డుల అభ్యర్థులను అధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను కొరారు.

Leave a Reply