రూ.10 కోట్లతో రహదారి నిర్మాణం
కతాల్గూడ నుంచి రాజీవ్ స్వగృహ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన
నల్గొండ, ఆంధ్రప్రభ: నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.
పట్టణంలోని 11వ డివిజన్ మామిళ్లగూడ మీదుగా కతాల్గూడ నుంచి రాజీవ్ స్వగృహ వరకు ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అలీ అమేర్, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
