అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా వాసి మృతి
మరిపెడ, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీకి చెందిన. దారం సుప్రజ 31 అమెరికాలో సెయింట్ లూయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈమె అమెరికాలోని సెయింట్ లూయిస్ లో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికి కారును ట్రక్కు వేగంతో ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో యువతి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతిచెందిన సుప్రజకు భర్త కుమారుడు ఉన్నారు.
