Road Accident | హృదయవిదారకం

Road Accident | హృదయవిదారకం
Road Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం హృదయవిదారకంగా మారింది. గంగవరం మండలంలోని వైఎస్సార్ జంక్షన్ వద్ద ఇవాళ కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందారు.
మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక వాసులు మృతులుగా గుర్తించారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని, మృతుల గుర్తింపు పూర్తయినట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
