Road | బీటీ రోడ్డు పనులు ప్రారంభం

Road | బీటీ రోడ్డు పనులు ప్రారంభం
Road | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జామ చెట్ల బావి నుండి కొండాపురం వరకు రూ. 2 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఇటీవల తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ శంకుస్థాపన చేశారు. ఇట్టి పనులకు ఇటీవల టెండర్ పూర్తి కావడంతో.. బుధవారం బీటి రోడ్డు పనుల ను ప్రారంభించారు .
పనుల్లో భాగంగా జెసిబి తో రోడ్డు వెంట చెట్లను తొలగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు సమీపించడం పై జామచెట్లబావి, కొండాపురం ప్రజల చిరకాల వాంఛ బీటీ రోడ్డు పనులు ఎన్నికల సమయంలో హామీ నెరవేస్తుండడంతో ఇక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు ఓ కళ అని ..అది నెరవేరడం సంతోషంగా ఉందన్నారు.
