- 26 వేల క్యూసెక్కుల నీరు విడుదల
సూర్యాపేట, ఆంధ్రప్రభ : మూసీ నదిలో వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. 17,264 క్యూసెక్కుల వరదనీరు నదిలోకి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూసీ ప్రాజెక్టు వద్ద ఎనిమిది గేట్లు ఎత్తి 26 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ముప్పు నేపథ్యంలో మూసీ దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

