టాలీవుడ్‌కు విశేషమైన సేవలందించిన సీనియర్ నిర్మాత మహేంద్ర Mahendra ) (ఏ.ఏ ఆర్ట్స్ అధినేత) (A A arts)గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహేంద్ర , చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి లోకాన్ని విడిచారు.
నేడు ఆయన స్వస్థలమైన గుంటూరులో కుటుంబ సభ్యులు అంత్యక్రియలను (funeral ) నిర్వహించనున్నారు. ఈ వార్త తెలుగుతెరకు షాక్ కలిగించింది. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఇక ‘ప్రేమించి పెళ్ళి చేసుకో’ అనే మూవీతో నిర్మాతగా మారిన మహేంద్ర ఆ తర్వాత ‘ఆరని మంటలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘తోడు దొంగలు’, ‘ఎదురులేని మొనగాడు’, ‘ఢాకూ రాణి’, ‘ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్మ్యం’ వంటి చిత్రాలతో నిర్మాతగా విజయాన్ని అందుకున్నారు.
శ్రీహరి ని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ చిత్రాన్ని నిర్మించింది కూడా ఆయనే. మహేంద్ర కేవలం వ్యాపార దృష్టితో కాకుండా, ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించాలనే సంకల్పంతో చిత్రాలను నిర్మించారనే అభిప్రాయం పరిశ్రమలో ఉంది.