RIP | అమర జవాన్ మురళి నాయక్ కు లోకేష్ తో సహ పలువురు మంత్రులు ఘన నివాళులు

శ్రీ సత్యసాయి బ్యూరో. మే 11 (ఆంధ్రప్రభ): భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ పార్థీవ దేహం కు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చం వుంచి, శ్రద్ధాంజలి ఘటించారు

.ఇందులో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్, హోంమంత్రి వి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, మంత్రులు సవిత, హిందూపురం ఎంపీ పార్థసారథి , కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తదితరులు ఉన్నారు.

అనంతరం వారుగోరంట్ల మండలం గుమ్మయ్యగారి పల్లి కల్లి తండాలోని వీరజవాన్ కుటుంబ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇంకా మురళి నాయక్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారితో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అత్తారు చాంద్ బాషా, కదిరి వైకాపా సమన్వయకర్త బి ఎస్ మక్బూల్ అహ్మద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply