సౌకర్యాల పై సమీక్ష..

సౌకర్యాల పై సమీక్ష..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దుర్గ గుడి ఈవో శీనా నాయక్, సిఎస్ విజయనంద్ కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. సి.ఎస్. విజయానంద్ దంపతులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారితో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈఓ శీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా సి.ఎస్. విజయానంద్.. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను ఈఓ శీనా నాయక్ వివరించారు.

Leave a Reply