Revenue Clinic | స‌ద్వినియోగం చేసుకోవాలి..

Revenue Clinic | స‌ద్వినియోగం చేసుకోవాలి..

  • సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌లు
  • కలెక్టర్ రాజాబాబు

Revenue Clinic | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర.పి.రాజాబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క‌లెక్ట‌రేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( మీకోసం)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌ను ఆ రోజు ఆయన ప్రారంభించారు. ఈ రెవెన్యూ క్లినిక్‌లో ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ మీకోసం ‘లో ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూకు సంబంధించిన‌వి వస్తున్నాయని, అందువల్ల వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముందుగా జిల్లా స్దాయిలో ఒక నెలరోజులపాటు నిర్వహించిన అనంతరం డివిజన్ స్దాయిలో ఈ క్లినిక్ లను నిర్వహిస్తామని తెలిపారు. చివరిగా మండల స్థాయిలో నిర్వహిస్తామన్నారు.

ఇదీ క్రమం…
రిసెప్షన్ : ముందుగా అర్జీని స్వీకరించేందుకు ఒక రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తహసీల్దార్ స్థాయి అధికారి ఇందులో ఉంటారు. అర్జీని స్వీకరించి సంబంధిత రెవెన్యూ కౌంటర్ వద్దకు అర్జీదారుని పంపిస్తారు.

కౌంటర్ -1 : ఆర్.ఓ.ఆర్, పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజర్వు ఫారెస్ట్ భూములకు సంబంధించిన సమస్యలను ఈ టేబుల్ వద్దకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

కౌంటర్ -2 : వెబ్ ల్యాండ్ నందు కొత్తగా సర్వేనెంబర్ నమోదు సమస్యలు, భూమి వివరణ మార్పులు, విస్తీర్ణంలో మార్పుల సమస్యలను ఈ టేబుల్ వద్దకు తీసుకెళ్తారు.

కౌంటర్ -3 : చుక్కల భూములు, 22(ఏ)(1) తొలగింపు, ఇంటి నివేశన స్థలాలు, అసైన్మెంట్ భూముల సమస్యలను ఈ టేబుల్‌లోని అధికారులు పరిశీలిస్తారు.

కౌంటర్ – 4 : రీ సర్వే సమస్యలు, జాయింట్ ఎల్పీఎం, ఇతర సర్వే సంబంధిత సమస్యలను పరిశీలించేలా ఈ టేబుల్ ఏర్పాటు చేశారు.

కౌంటర్ – 5 : ఇతర భూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ఈ టేబుల్ వద్దకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

ఆయా సమస్యలను పరిష్కరించేందుకు మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులతోనూ తహసీల్దార్లు కూడా ఈ క్లినిక్ లో అందుబాటులో ఉంటారు. సంబంధిత ఆర్డీవోలు వీటిని పరిశీలిస్తారు.

Leave a Reply