ఎమ్మెల్యేతో మర్యాదపూర్వక భేటీ..

ఎమ్మెల్యేతో మర్యాదపూర్వక భేటీ..
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్
తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మండల తహసీల్దార్‌గా పి. వైకుంఠరావు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన గురువారం తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు రావును వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు రెవెన్యూ సేవలను వేగవంతంగా అందించడంపై చర్చించినట్లు తెలిసింది.
మండల ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావడంతో పాటు రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ భేటీలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

