
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : వరద ప్రాంతాల పరిశీలన నిమిత్తం హనుమకొండ సుభేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వారందరికీ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. హెలికాప్టర్ ద్వారా వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ ఎమ్మెల్యేలు వరంగల్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

