Reservation | రెండోసారి ఉపసర్పంచ్‌గా శ్రీనివాస్ గుప్తా
- గ్రామస్తులకు కృతజ్ఞతలు
Reservation | రాయపోల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో లింగారెడ్డిపల్లి ఉప సర్పంచ్‌గా తోట శ్రీనివాస్ గుప్త వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి మరోసారి బాధ్యత ఇచ్చినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలుపుతూ.. గ్రామ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానన్నారు.
తనకు సర్పంచ్ పదవిపై ఆసక్తి ఉన్నా ఈ సంవత్సరం రిజర్వేషన్(Reservation) అనుకూలంగా రాక పోవడం తో వార్డు సభ్యునిగా పోటీచేసి గెలుపొందానన్నారు.గత పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల(development programs)ను కొనసాగిస్తూ, పరిష్కారం దక్కాల్సిన మిగిలిన సమస్యలను సర్పంచ్ తో కలిసి గ్రామాభివృద్ధిని ప్రాధాన్యతతో చూసుకుంటానని చెప్పారు. ప్రజలతో సమన్వయం కలిగి పనిచేయడం ద్వారా గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెల్లెందుకు సహాకారం అందిస్తామన్నారు.

