గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం గ్రామ సర్పంచ్ ఎన్న పల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు గురువారం మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.

గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, పాత ఆరేగుడెం నక్షా రోడ్డు సర్వే చేయడం తదితర అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను కేటాయించి గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి సర్పంచ్ ధనలక్ష్మీ వెంకట్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సర్పంచ్, పాలకవర్గం సభ్యులకు, గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులతో పాటు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply