కొండగడప బస్టాప్‌లో బస్సులు ఆపాలి

  • ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం.. టికెట్‌ మిషన్‌లో బస్టాప్‌ నమోదు

మోత్కూర్‌, ఆంధ్రప్రభ : మోత్కూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప బస్టాప్‌ వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్టాప్‌లో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం స్థానికులు ఆర్టీసీ అధికారులను కోరారు.

ఈ మేరకు తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌ డి. ప్రసూనలక్ష్మిని కౌన్సిలర్‌ కొండ శోభ సోమల్లు, మాజీ సర్పంచ్‌ కన్నబోయిన ఉమారాణి లింగయ్య, గ్రామ పెద్ద కొప్పుల శ్రీధర్‌రెడ్డి కలిసి స్వయంగా కలిసి వినతిపత్రం అందజేశారు. కొండగడప బస్టాప్‌లో బస్సులు ఆపకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

వినతిపై డిపో మేనేజర్‌ సానుకూలంగా స్పందించారు. కొండగడప బస్టాప్‌ను టికెట్‌ మిషన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఇకపై బస్సులు బస్టాప్‌లో ఆపేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్‌కు కౌన్సిలర్‌, గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.