Report | నలుగురు మృతి..

Report | నలుగురు మృతి..
Report | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో కల్తీ పాల కలకలం ఘటన చోటుచేసుకుంది. కల్తీ పాలు తాగడంతో చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలో నలుగురు మృతిచెందగా.. 13మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధితులు విలవిలలాడుతున్నారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ అనారోగ్యానికి గురవ్వడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అందరూ ఒకే చోట పాలు కొనడంతో కల్తీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కల్తీ పాల వ్యవహారానికి సంబంధించి అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీ పాలు తాగిన కాలనీల్లో 13 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.

