AP | రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు !
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు ప్రతిరోజూ గంట కంటే ముందే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా మార్చి 2 నుంచి 30వ తేదీ వరకూ ఒక గంట ముందుగా విధులు ముగించుకుని వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది ప్రభుత్వం.
