ఎమ్మెల్యే గండ్రను కలిసిన రేగొండ ప్రెస్‌ క్లబ్‌ కమిటీ

ప్రెస్‌ క్లబ్‌ నిర్మాణానికి సహకరించాలని వినతి

రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రేగొండ మండల జర్నలిస్టులు ప్రెస్‌ క్లబ్‌ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి, నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. కమిటీ సభ్యుల వినతిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సానుకూలంగా స్పందించారు. ప్రెస్‌ క్లబ్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించాలని రేగొండ మండల తహసీల్దార్‌ శ్వేతరావుకు ఫోన్‌ చేసి ఆదేశించారు. ప్రెస్‌ క్లబ్‌ నిర్మాణానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రెస్‌ క్లబ్‌ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సన్మానించారు. ప్రెస్‌ క్లబ్‌ భవన నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుంకరి శ్రీధర్‌, గౌరవ అధ్యక్షుడు నామాల రమేష్‌, గౌరవ కార్యదర్శి ఆకుల వెంకటేష్‌, కోశాధికారి బత్తుల ఆనంద్‌, ఉపాధ్యక్షులు పల్నాటి రాజు, గన్‌రెడ్డి కర్ణాకర్‌రెడ్డి, కార్యదర్శి గంగిరేణి రమేష్‌, కార్యవర్గ సభ్యులు బోయిని రాజు, బత్తుల వెంకటేశ్వర్లు, బండి సమ్మయ్య, వెంగళ రణధీర్‌, గుర్రం స్వరాజ్‌, బండారి తిరుపతి, ప్రవీణ్‌, గునిగంటి రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.