tirumala| 6 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
6 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- 8 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు..
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 68,004 మంది భక్తులు
- హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు..
- 25,964 మంది తలనీలాల సమర్పణ
తిరుమల, నవంబర్ 5, ఆంధ్రప్రభ: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ప్రస్తుతం కొంత తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు కొనసాగిస్తోంది.
నిన్నటి దర్శనాల వివరాలు
నవంబర్ 4న మొత్తం 68,004 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,964 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ద్వారా రూ.3.91 కోట్ల ఆదాయం సమకూరింది.
లడ్డూ విక్రయాలు ఇలా..
నిన్న ఒక్కరోజే 3.31 లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించారు. అన్నప్రసాదం ద్వారా 1.51 లక్షల మంది భక్తులకు సేవలు అందించారు. అశ్విని ఆసుపత్రిలో 2,282 మంది నమోదయ్యారు.
ప్రస్తుత దర్శన సమయం
నవంబర్ 5న ఉదయం అందిన సమాచారం ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు సుమారు 6 గంటల్లో దర్శనం లభించనుంది.
07.11.2026 (శనివారం) నాటి అంగప్రదక్షిణ సేవ e-DIP టికెట్ల నమోదు, తిరుపతి (పట్టణ & గ్రామీణ), తిరుమల, చంద్రగిరి మండలం మరియు రేణిగుంట మండల స్థానికులకు (మాత్రమే) 05.11.2026 తేదీన ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.
నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ
తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబరు 7 నుండి 20వ తేదీ వరకు అందించనున్నారు. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వద్ద గల కొత్త జాబిలి భవనంలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లు తమ స్మార్టు కార్డు చూపి ఒక పెద్ద లడ్డూ, ఒక వడ పొందవచ్చు.
పిపిఓ నంబర్ల వారీగా ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. నవంబరు 7న 164 నుండి 3,250 వరకు, నవంబరు 9 నుండి 13వ తేదీ వరకు 3,251 నుండి 9,050 వరకు, నవంబరు 16 నుండి 19వ తేదీ వరకు 9,051 నుండి 12,550 వరకు, నవంబరు 20న 12,551 నుండి మిగిలిన పింఛన్‌దారులందరికీ ప్రసాదాలు అందిస్తారు.
విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.
