సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : ఇటీవల చోరీకి గురైన 2 సెల్ ఫోన్‌ల(Cell phones)ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు తమ సెల్ ఫోన్‌లను కమ్మర్ పల్లి ఎస్ఐ జీ. అనిల్ రెడ్డి(SI G. Anil Reddy) ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెల్ ఫోన్‌లు చోరికి గురైన బాధితులు పోలీస్ స్టేషన్లో(at the police station) ఫిర్యాదు చేయగా వేర్వేరుగా కేసులు నమోదు చేసి సెంట్రల్ ఇక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(Central Equipment Identity Register) (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు.
చోరీ అయిన ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదుల ఆధారంగా సెల్ ఫోన్‌లను రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరిలో సహాయపడిన మహిళ పోలీసు కానిస్టేబుల్ జీ. వసుధ(G. Vasudha)ను ఎస్ఐ అనిల్ రెడ్డి అభినందించారు. సెల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.