నగదు, ఆభరణాలు స్వాహాపై విచారణ ప్రారంభం

నగదు, ఆభరణాలు స్వాహాపై విచారణ ప్రారంభం
పెనమలూరు – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు శివాలయంలో జరిగిన హుండీలో నగదు, ఆభరణాలు స్వాహా పై విచారణ ప్రారంభమయింది. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా, ఆలయ ఉద్యోగులు, అర్చకులను అధికారులు విచారిస్తున్నారు. పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత మాట్లాడుతూ శివాలయంలో నగదు చోరీ, అవకతవకలపై విచారణ చేస్తున్నామన్నారు. 15 రోజుల్లో విచారణ పూర్తిచేసి కమిషనర్ కి నివేదిక అందజేస్తామన్నారు. గత ఐదు సంవత్సరాల రికార్డులను పరిశీలిస్తామన్నారు. ఈవోపై విచారణ చేస్తారా అని అడిగితే… సమాధానం చెప్పకుందాం అధికారులు దాట వేశారు.
