RC Goud | సేవ చేసే భాగ్యం కల్పించండి
- మల్కాపూర్ ప్రజల రుణం తీర్చుకుంటా
- సర్పంచు అభ్యర్థి ఈడ్డి విజయలక్ష్మీ ఆర్సీ గౌడ్
RC Goud | తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ ప్రజలకు సేవచేసే భాగ్యం తనకు కల్పించాలని గ్రామ సర్పంచు అభ్యర్థి ఈడ్డి విజయలక్ష్మీ ఆర్సీ గౌడ్(RC Goud) కోరారు. ఈ రోజు గ్రామంలో తనకు కేటాయించిన గుర్తును ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. తన భర్త ఆర్సీ గౌడ్, స్థానిక ప్రజల ఆశీర్వాదంతోనే సర్పంచుగా పోటీ చేస్తున్నానని తెలిపారు. సర్పంచుగా గెలిపిస్తే ప్రజలందరికి అండగా ఉంటామన్నారు.
యువతకు క్రీడలు, చదువు(Sports, Education)లో రాణించేందుకు సహాకారం అందిస్తామన్నారు. ఆడపిల్ల పుట్టిన ఇంటింటికి సొంతంగా రూ. 2వేల నజరానా అందిస్తామన్నారు. పేదల అంత్యక్రియలకు కూడా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గెలిస్తే మరింత సంక్షేమం, అభివృద్ధి చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ప్రచారంలో ప్రజల అభిమానం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి గెలిపించాలనే అతృతతో ఉన్నారని, ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు.

