‘RC 17’ ఈవెంట్లో హైలైట్‌గా మారిన యంగ్ హీరో
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అనగానే సినీ సర్కిల్స్‌లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ (RC 17) పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లాప్ కొట్టి ఈ చిత్రానికి శ్రీకారం చుట్టడంతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ, ఈ ఈవెంట్ లో ఒక ప్రత్యేక వ్యక్తి అందరి దృష్టిని తమ వైపునకు తిప్పుకున్నారు. ఇటీవల ‘డొరోతీ’, ‘మోధ రాత్రి’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ నటుడు రిషికాంత్ ఈ వేడుకలో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో తెలుగులో ‘కపుల్ ఫ్రెండ్లీ’, ‘లాక్డ్’ వంటి వెబ్ సిరీస్‌లతో పరిచయమైన రిషికాంత్.. ఇప్పుడు నేరుగా రామ్ చరణ్ – సుకుమార్ కాంబో సినిమాలో భాగం కాబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, తమిళ పరిశ్రమ నుంచి వస్తున్న ఈ వర్సటైల్ యంగ్ హీరోకు టాలీవుడ్లో ఇది కెరీర్ టర్నింగ్ ప్రాజెక్ట్ కావడం ఖాయం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. సుకుమార్ రైటింగ్స్ , టి-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతో, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
