Raviteja | ఆ నలుగురుకి.. సంక్రాంతి సక్సెస్ అందించేనా..?

Raviteja | ఆ నలుగురుకి.. సంక్రాంతి సక్సెస్ అందించేనా..?
Raviteja | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించారు. మొదటి రెండు పాటలు (Songs) ఇప్పటికే అద్భుతమైన స్పందనను పొందాయి. ఇప్పుడు, మేకర్స్ మూడవ సాంగ్ వామ్మో వాయ్యో ను వరంగల్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నలుగురుకు చాలా కీలకం. ఇంతకీ.. ఆ నలుగురు ఎవరు..? సంక్రాంతి సక్సెస్ అందించేనా..?

Raviteja | అంచనాలు పెంచేసిన భీమ్స్..
ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఆయన మరోసారి మాస్ ఆడియన్స్ కట్టిపడేసే సాంగ్ కంపోజ్ చేశారు. వామ్మో వాయ్యో ఫుల్ జోష్‌తో సాగే ఫోక్ ట్రాక్‌గా నిలుస్తూ, వినగానే ఎనర్జీని ఇస్తుంది. ఇక స్వాతి రెడ్డి (Swathireddy) అందించిన ప్రత్యేకమైన వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆమె వాయిస్‌లో ఉన్న ఆ ప్రత్యేక టోన్ పాటకు అదిరిపోయే ఎట్రాక్షన్ ని జోడించింది. కలర్ ఫుల్ సెట్ డిజైన్, విజువల్స్‌ను మరింత రిచ్‌గా చూపిస్తూ పాటలోని ఉత్సాహాన్ని తెర పై అద్భుతంగా ప్రజెంట్ చేసింది. దేవ్ పవార్ రాసిన లిరిక్స్‌లో పక్కా మాస్ టచ్ ఇచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే హై ఎనర్జీ స్టెప్స్‌తో కిక్ ఇచ్చింది.

Raviteja | సినిమాకి ప్లస్ అదే..
ఈ సినిమా ఎవరెవరికి కీలకం అంటే.. ముందుగా రవితేజ అని చెప్పాలి. రవితేజ ఈమధ్య కాలంలో.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర.. అంటూ సినిమాలు చేశాడు కానీ.. ఏ సినిమా కూడా సక్సెస్ అందివ్వలేదు. అందుచేత ఈ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు మాస్ సినిమాలు చేసిన రవితేజ (Raviteja) రూటు మార్చి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను జనాలు ఆదరిస్తుండడం.. పాటలు విశేషంగా ఆకట్టుకోవడం.. సంక్రాంతికి వస్తుండడం.. సినిమాకి ప్లస్ పాయింట్స్. ఈ సినిమా సక్సెస్ పై రవితేజ గట్టి నమ్మకంతో ఉన్నాడు.

Raviteja | కెమిస్ట్రీ అదిరింది..
ఇక డైరెక్టర్ కిషోర్ తిరుమల విషయానికి వస్తే.. చిత్రలహరి సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వలేదు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కిషోర్ తిరుమల నుంచి సినిమా రాలేదు. ఈ సినిమా కిషోర్ కు (Kishore) చాలా కీలకం. అలాగే ఈ సినిమాలో నటించిన డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్.. ఈ ఇద్దరికి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. పాటల్లో రవితేజ తన ట్రేడ్‌మార్క్ ఎనర్జిటిక్ డాన్స్‌తో మరోసారి అభిమానులను అలరించారు. ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి ఇద్దరూ గ్లామర్‌తో పాటు డ్యాన్స్ మూమెంట్స్ తోఆకట్టుకున్నారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ డాన్స్ ఫ్లోర్‌ను పూర్తిగా దద్దరిల్లేలా చేస్తుంది. ఈ సంక్రాంతికి జనవరి 13న ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం వస్తుంది. మరి.. రవితేజ, కిషోర్ తిరుమల, డింపుల్ హయతి, ఆషికా.. ఈ నలుగురుకు భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

