ర‌వితేజ‌ని యువ‌త స్పూర్తిగా తీసుకోవాలి…

ర‌వితేజ‌ని యువ‌త స్పూర్తిగా తీసుకోవాలి…

మక్తల్, ఆంధ్రప్రభ : అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Govt) ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో ఎంపికై, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవితేజను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ రోజు డిప్యూటి కలెక్టర్ రవితేజ(Deputy Collector Ravi Teja) అమ్మమ్మ గ్రామమైన నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణానికి వచ్చిన సందర్భంగా రవితేజని ఈ స్థాయికి రావడానికి వెన్నుదన్నుగా నిలిచిన వారి అమ్మ అరుణమ్మ, తాతయ్య రామచంద్రప్ప రిటైర్డ్ ఏఎస్‌డ‌బ్ల్యూ రాంచంద్రప్పలను కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి అభిందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్(Prithviraj) మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల నుండి కష్టపడి చదివి ఐఏఎస్ ఆధికారిగా ఎదిగిన రవితేజని యువత స్పూర్తిగా తీసుకొవాలన్నారు. మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే, అంబేద్కర్ కోరుకున్న ఆశయాల, ఆలోచనల మార్గంలో సమాజంలోనీ దళిత బహుజన బలహీన పేద వర్గాల ప్రజల విద్య, సామాజిక, ఆర్థిక అభ్యునతికి కృషి చేస్తూ పేదల కలెక్టర్ గా ప్రసిద్ధి చెందిన ఎస్ఆర్.శంకరన్ లా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ కలెక్టర్ రవితేజ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఫూలే(Ambedkar Phule) తనకు స్పూర్తి అని, తప్పకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి కృష్ణ, నాయకులు గోలపల్లి నారాయణ, కోరి మారెప్ప, కెఎన్పిఎస్ నాయకులు బండారి నర్సప్ప, మల్లేపల్లి రవి, పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు, స్వేరో రవికుమార్, రవి అంబేద్కర్ యువజన సంఘం సహాయ కార్యదర్శి రవి కుమార్, కోశాధికారి త్రిమూర్తి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply