Rasi Phalalu, November 2 2026 |నేటి రాశిఫలాలు.. ఈ 5 రాశుల వారికి అనుకూల ఫలితాలు!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్:

నవంబర్ 2, 2026 సోమవారం దినఫలాలు

ఈరోజు గ్రహగతుల ప్రభావంతో ద్వాదశ రాశుల వారి జీవితాల్లో విభిన్న పరిణామాలు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి. కొందరికి పనుల్లో ఆటంకాలు ఎదురైతే.. మరికొందరికి అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం తదితర విషయాల్లో నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

నేటి 12 రాశుల ఫలితాలు

మేష రాశి

ఈరోజు అనుకున్న పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. ఎంత శ్రమించినా ఆశించిన ఫలితాలు అందక నిరుత్సాహం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. మనసులో అనేక ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఆత్మీయులతో మాట్లాడటం కొంత ఊరటనిస్తుంది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. నగదు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు.

మిథున రాశి

ఈరోజు ఆర్థిక లావాదేవీలతో బిజీగా గడుపుతారు. పనిభారం పెరగడంతో విశ్రాంతి తగ్గుతుంది. సమయానికి భోజనం చేయలేని పరిస్థితులు ఎదురుకావచ్చు. ఒక శుభవార్త ఊరటనిస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. పరిచయస్తుల రాక కొంత ఇబ్బంది కలిగించవచ్చు. బెట్టింగులు, పందాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటక రాశి

ధైర్యంగా ముందడుగు వేసినా కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. బాధ్యతలను ఇతరులకు అప్పగించే విషయంలో జాగ్రత్త అవసరం. ప్రముఖులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. దంపతుల మధ్య చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. ఆత్మీయుల జోక్యంతో సమస్యలు పరిష్కారమవుతాయి.

సింహ రాశి

వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సొంత నిర్ణయాలే కాకుండా నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. కుటుంబ విషయాలను జీవిత భాగస్వామితో దాచకుండా చర్చించాలి. ఆర్భాటాలకు ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. పనుల్లో జాప్యం ఎదురవుతుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి

ఈరోజు అదృష్టం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. కొత్త అవకాశాలు అనుకోకుండా తలుపుతడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గతంలో కనిపించకుండా పోయిన వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించాలి. మీ సహాయంతో మరొకరికి మేలు జరుగుతుంది.

తుల రాశి

అనుకున్న పనులు పూర్తి కావడానికి అదనపు శ్రమ అవసరమవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ఇతరుల పొగడ్తలకు ప్రభావితం కావద్దు. ముఖ్యమైన వ్యక్తులను కలిసినా ఆశించిన ఫలితం వెంటనే దక్కకపోవచ్చు. ఆలోచనల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది.

వృశ్చిక రాశి

మీ అభిరుచులకు అనుగుణమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. గతంలో వ్యతిరేకించిన వారే మీకు దగ్గరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విలాసాల కోసం ఖర్చులు పెరగవచ్చు. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. నగదు, ఆభరణాల విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి

ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉత్సాహంగా రోజును గడుపుతారు. ఆప్తులకు అవసరమైన సహాయం అందిస్తారు. పనులు కొంత హడావుడిగా సాగుతాయి. అవసరమైన వస్తువుల కోసం వెతకాల్సి రావచ్చు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు తీసుకుంటారు.

మకర రాశి

ఈరోజు గ్రహస్థితి సాధారణంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన బాధ్యతలను ఇతరులకు అప్పగించకపోవడం మంచిది. బెట్టింగులు, పందాలకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి

ఈరోజు పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో అంచనాలు నిరాశపరచవచ్చు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. చేపట్టిన పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

మీన రాశి

ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కష్ట సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పనుల్లో శ్రమ, చికాకులు ఎదురవుతాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.