RashiPhalalu | నేటి రాశి ఫలాలు – 30.05.25

30-5-25

మేషం

తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. కుటుంబ విష‌యాల్లో అనాస‌క్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

వృషభం

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

మిథునం

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రింప‌బడుతాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. ఆక‌స్మిక ధ‌నలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. భ‌క్తి శ్ర‌ద్ధ‌లు అధిక‌మ‌వుతాయి.

ర్కాటకం

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తిరీత్యా గౌర‌వ మ‌ర్యాద‌లు పొందుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. మ‌నోల్లాసాన్ని పొందుతారు. స్వ‌ల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

సింహం

ఇత‌రుల‌తో గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మాన‌సికంగా ఆందోళ‌న చెందుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

న్య

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. మోస‌పోయే అవ‌కాశాలు ఉంటాయి. ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కూడ‌దు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

తుల

త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశంవ‌ల్ల కొన్ని ప‌నులు చెడిపోతాయి.

వృశ్చికం

కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదావేసిన ప‌నుల‌న్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్ప‌డుతుంది. స్థిర‌నివాసం ఉంటుంది. వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి. సూక్ష్మ విష‌యాల‌ను గ్ర‌హిస్తారు.

నుస్సు

ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లిస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్య‌సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తిచేస్తారు. శుభ‌వార్త‌లు వింటారు.

రం

కుటుంబ‌ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించ‌డం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. అన‌వ‌స‌ర ధ‌నవ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ‌సేవ అవ‌స‌రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *