రంగరాజు మరింత ఉన్నతికి ఎదగాలి..

వికారాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులైన కాకి రంగరాజును కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రంగరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. రంగరాజు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాండు, శ్రీనివాస్‌రెడ్డి, బాబు నాయక్, ఎండీ పాషా పాల్గొన్నారు.