Ranabaali Documentary | ‘రణబలి’ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రయోగం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బిగ్ బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ అనగానే మేకర్స్ అంతా సీక్రెసీ పాటిస్తుంటారు. చివరి నిమిషం వరకు కథ ఏంటి? నేపథ్యం ఏంటి? అనేది బయటకు రాకుండా జాగ్రత్తపడటం, చివరికి ట్రైలర్లు కూడా రిలీజ్ చేయకుండా సస్పెన్స్ మెయింటెన్ చేయడం ఈమధ్య ఒక ట్రెండ్‌గా మారింది. కానీ, విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబలి’ విషయంలో ‘రణబలి’ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ సంచలన ప్రయోగం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బిగ్ బడ్జెట్ సినిమాల ప్రమోషన్స్ అనగానే మేకర్స్ అంతా సీక్రెసీ పాటిస్తుంటారు. చివరి నిమిషం వరకు కథ ఏంటి? నేపథ్యం మేకర్స్ సరికొత్త దారిని ఎంచుకున్నారు.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సినిమా కథ, దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం, మేకింగ్ విశేషాలను వివరిస్తూ ఏకంగా 4 ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్ ‘నెవర్ ఫర్గెట్ ది ట్రూత్’ (Never Forget The Truth)ను యూట్యూబ్‌లోకి తీసుకువచ్చారు.

తొలి ఎపిసోడ్: ‘ది ఫ్యామిన్ వి ఫర్గెట్’ (మనం మరచిపోయిన కరువు)

ఈ డాక్యుమెంటరీ తొలి ఎపిసోడ్ ‘ది ఫ్యామిన్ వి ఫర్గెట్’ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ చరిత్రలో నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయిన ఒక దిగ్భ్రాంతికరమైన కరువు నేపథ్యం, ఆ పరిస్థితులే ఈ సినిమా కథకు ఎలా మూలకారణంగా నిలిచాయో ఇందులో ఎంతో పారదర్శకంగా చూపించారు. సస్పెన్స్ వెనుక దాక్కోకుండా, తాము ఏ కథను చెప్పబోతున్నామో, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ప్రేక్షకులకు ముందే స్పష్టంగా వివరించడం మేకర్స్‌కి కథపై ఉన్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.

19వ శతాబ్దపు ప్రపంచాన్ని కళ్లకు కట్టిన తీరు

సినిమా కోసం పడ్డ కష్టం, విజువల్ స్కేల్ ఎంత పెద్దదో ఈ డాక్యుమెంటరీ స్పష్టం చేస్తోంది. 19వ శతాబ్దపు వాతావరణాన్ని రీ-క్రియేట్ చేయడానికి రియలిస్టిక్ లొకేషన్లు, భారీ సెట్లు, కాస్ట్యూమ్స్ప్ర తి చిన్న వస్తువు, దుస్తులు నాటి కాలాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ, ప్రతి ఫ్రేమ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్, బ్రహ్మాండమైన స్కేల్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

విడుదలకు ముందే స్పష్టమైన అంచనాలు!

తొలి ఎపిసోడ్ తర్వాత.. ‘ది హిస్టరీ వి ఫర్గెట్’, ‘ది మెన్ వి ఫర్గెట్’, ‘ది లాస్ట్ లోడ్’ అనే మరో మూడు ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సిరీస్ ద్వారా ప్రేక్షకులు సినిమా థియేటర్‌కు వచ్చే ముందే కథా ప్రపంచానికి అలవాటుపడి, ఒక స్పష్టమైన అంచనాతో థియేటర్‌లోకి అడుగుపెట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అక్టోబర్ 16న ‘రణబలి’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్‌లో మేకర్స్ పాటిస్తున్న ఈ డిఫరెంట్ అప్రోచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.