RAMESH | బీఆర్‌ఎస్ ఇంటింట విస్తృత ప్రచారం
- కత్తెర గుర్తుకు ఓటు వేసి దొమ్మటి ఇందిరా రమేష్ ను గెలిపించాలి
RAMESH | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొమ్మటి ఇందిరా రమేష్ కు మద్దతు పెంచేందుకు ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి, పరకాల మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు అడప రాము, శనిగరం నవీన్, బీఆర్ఎస్ నాయకులు దుంపేటి నాగరాజు, పంచగిరి శ్రీనివాస్, షబ్బీర్ అలీ, వాడికారి మధుకర్, మాజీ సర్పంచ్ లు దుమల శ్రీనివాస్, బయ్య రాజేందర్ ప్రచారంలో పాల్గొని మల్లక్కపేట గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి దొమ్మటి ఇందిరా రమేష్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు.

