Ramayana Movie | సన్నీ డియోల్ పాత్రపై ఆసక్తికర విషయం!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. నవంబర్ 5 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమా విడుదల దగ్గరపడటంతో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు విడుదల వేళ ఓ ఆసక్తకర విషయం ఇప్పుడు సినీవర్గాల్లో చక్కెర్లు కొడుతుంది. రామాయణంలో హనుమంతుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, చాలామంది ప్రేక్షకుల్లో ఒకటే సందేహం. మొదటి పార్ట్ లో హనుమంతుడు కనిపిస్తారా? లేదా? అని.
సినిమా రెండో భాగం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే ఈ షూటింగ్ లో సన్నీ డియోల్ పాల్గొన్నట్లు సమాచారం. రామాయణంలో హనుమంతుడి పరిచయం, ఆయనకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు కిష్కింధాకాండలోనే ఉంటాయి. మొదటి భాగంలో రాముడి బాల్యం, వివాహం, అరణ్యకాండ ఘట్టాలతో సాగనుంది. ఇక కిష్కింధాకాండ ఘట్టాలను సినిమా రెండో భాగంలో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అంటే మొదటి భాగంలో హనుమంతుడి పాత్ర ఎక్కువగా కనిపించకపోవచ్చని చర్చ జరుగుతోంది. కానీ.. మేకర్ప్ అభిమానుల కోసం ఒక చిన్న సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలిస్తోంది. ఇందు కోసం మేకర్స్ సినిమా చివర్లో ఆడియన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్ చేసినట్లు తెలస్తోంది. ఇంతకీ హనుమంతుడే అంటూ.. టాక్ నడుస్తోంది. ఈ టాక్ తో అసులు హనుమంతుడిని ఎలా చూపిస్తారు? అనే ఆసక్తి మొదలైంది. ఆ సర్‌ప్రైజ్ కి తెరపడాలి అంటే.. సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..!
