Ramayana 2026 | క్లైమాక్స్ లో ఊహించని ఎంట్రీ.. భారీగా ప్లాన్ చేసిన మేకర్స్!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రస్తుతంమ బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత భారీ పౌరాణిక చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటే విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచాయి. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
‘రామాయణ పార్ట్ 1’ ఈ దీపావళీకి విడుదల కానుంది. అయితే ఆ సినిమా క్లైమాక్స్ లో భారీ సర్పైజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్ప్. విడుదలైన టీజర్, ట్రైలర్ ఎక్కడా హనుమంతుడు కనిపించలేదని.. సోషల్ మీడియాలో చర్చ జరగిన విషయం తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్ లో హనుమంతుడి ఎంట్రీని ఉండబోతుందని టాక్. ఈ పాత్రలో నటిస్తున్న సన్నీ డియోల్ ఎంట్రీని సాధారణంగా కాకుండా చాలా భారీ స్థాయిలో చిత్రీకరించారని వినిపిస్తోంది. సినిమా క్లైమాక్స్‌లో లేదా చివరి సన్నివేశాల్లో ఆయన పాత్రను చూపించి.. రెండో భాగంపై అంచనాలను ఒక్కసారిగా పెంచేలా దర్శకుడు ప్లాన్ చేశారనే వార్తలు వస్తున్నాయి.
సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారనే విషయం గతంలోనే ఆసక్తిని పెంచింది. అయితే ఆయన తెరపైకి వచ్చే విధానమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పాత్రను రివీల్ చేస్తే.. అది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు ‘రామాయణ పార్ట్ 2’పై భారీ ఆసక్తిని క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అమెరికాలో జరిగిన ఓ ప్రముఖ సినీ కార్యక్రమంలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రకు సంబంధించిన గెటప్ చూసినవారు ఆశ్చర్యపోయారని.. ఇప్పటివరకు సన్నీ డియోల్‌ను ఎప్పుడూ చూడని విధంగా డిజైన్ చేశారని ప్రశంసలు వచ్చినట్లు సమాచారం. నిజంగానే ‘రామాయణ పార్ట్ 1’ చివర్లో హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తే మాత్రం.. ఆ ఒక్క సన్నివేశం రెండో భాగంపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
