ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన రామగుండం సీపీ
గోదావరిఖని, ఆంధ్రప్రభ: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని జ్యోతి భవన్‌లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
