Ram charan | సుక్కు మూవీ కథ ఏంటి..?

Ram charan | సుక్కు మూవీ కథ ఏంటి..?

Ram charan | రంగస్థలం తర్వాత మరోసారి చరణ్ – సుకుమార్ కాంబో
చరణ్ కోసం రెండు కథలు రెడీ చేసిన సుకుమార్
రెండు కథలకు చరణ్ ఓకే చెప్పాడా?
ఏ జోనర్ లో సినిమా? సస్పెన్స్ లో సుక్కు నిర్ణయం
‘పెద్ది’ తర్వాత సెట్స్ పైకి రానున్న క్రేజీ ప్రాజెక్ట్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. ఈ ఇద్దరి కాంబోలో రంగస్థలం మూవీ రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత మరో సినిమా చేయాలి అనుకున్నారు. ప్రస్తుతం చరణ్‌ కోసం సుకుమార్ కథ రెడీ చేశారు. త్వరలో సెట్స్ పైకి వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా చరణ్‌ కోసం ఒకటి కాదు రెండు కథలు రెడీ చేశారని తెలిసింది. ఇంతకీ.. రెండు కథలు రెడీ చేయడానికి కారణం ఏంటి..? ఏ కథతో చరణ్, సుక్కు సినిమా చేయనున్నారు..?

Ram charan | రెండు కథలకు ఓకే చెప్పిన చరణ్‌..

Ram charan

చరణ్‌ లో ఉన్న నటుడ్ని బయటకు తీసిన సినిమా అంటే.. రంగస్థలం. అందులో ఎవరికీ డౌట్ లేదు. అలాంటి అద్భుతమైన సినిమా అందించిన సుకుమార్.. మరోసారి చరణ్ తో సినిమా చేస్తే.. అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకనే సుకుమార్ కథ విషయంలో కంగారు పడడం లేదు. పుష్ప 2 రిలీజ్ తర్వాత నుంచి సుకుమార్ చరణ్‌ కోసం కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇంకా చరణ్‌ కు కథ చెప్పలేదని గుసగుసలు వినిపించాయి. అయితే.. అసలు విషయం ఏంటంటే.. చరణ్‌ కి సుకుమార్ కథ చెప్పడం.. ఆ కథ నచ్చడం కూడా జరిగిందట.

Ram charan | అది మాత్రం సస్పెన్స్..

Ram charan

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చరణ్ నచ్చిందని చెప్పిన కథను పక్కనపెట్టి మరో కథ రెడీ చేసాడట సుకుమార్. మొద‌ట చెప్పిన క‌థ కంటే, రెండో క‌థ ఇంకా బాగా వచ్చిందట. కాక‌పోతే.. చ‌రణ్‌కి ఈ రెండో క‌థ వినిపించ‌లేదని ప్రచారం జరుగుతుంది. మరో వైపు రెండో కథ కూడా చరణ్‌ విన్నాడు.. ఈ రెండు కథలు చరణ్‌ కి బాగా నచ్చాయని అయితే.. ఈ రెండు కథల్లో ఏ కథతో సినిమా చేయడం అనే నిర్ణయం సుకుమారే తీసుకోవాలని టాక్. దీంతో ఏ కథతో సినిమా చేయనున్నారు. జోనర్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. పెద్ది రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. పూర్తి వివరాలు తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Ram charan

Leave a Reply