RALLY | హోరెత్తించిన ప్రచారం, ర్యాలీలు…

RALLY | హోరెత్తించిన ప్రచారం, ర్యాలీలు…

RALLY | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలైన టీట‌ఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి బలపర్చిన అభ్యర్థులు ఆ పార్టీ ప్రముఖ నాయకులతో కలిసి ఈ రోజు ఉట్నూరులో వారపు సంత ఉండడంతో ర్యాలీలతో ప్రచారంతో హోరెత్తించారు. తమ గుర్తులకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థులు వేరువేరుగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రచారం నిర్వహించారు.

వారపు సంతలో పోటాపోటీగా అభ్యర్థులు తమ గుర్తులైన ఫుట్ బాల్, టూత్ పేస్ట్, బెండకాయ గుర్తులతో ప్రచారం చేస్తూ బ్యాలెట్ పేపర్లను ప్రజలకు అందిస్తూ ఆశీర్వదించాలని కోరారు. జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, అభ్యర్థులు చారులత రాథోడ్, మెస్రం భాగ్యలక్ష్మి, బానోత్ సంగీత, ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply