రాజీవ్ స్మారక ఫౌండేషన్

రాజీవ్ స్మారక ఫౌండేషన్

చౌటుప్పల్, అక్టోబర్ 23 (ఆంధ్రప్రభ) : చౌటుప్పల్ పట్టణంలోని రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేద కాంగ్రెస్ కుటుంబాలకు గురువారం ట్రస్ట్ ప్రతినిధులు ఆర్థిక సహాయం చేశారు. చౌటుప్పల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోశిక నాగరజు భార్య గోశిక చంద్రకళకు రూ. 15వేలు, స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన కందగట్ల వెంకటాద్రికి రూ. 15 వేలు, నేలపట్ల గ్రామానికి చెందిన యనమల్ల లావణ్యకు రూ. 15వేలు, తూర్పు గూడెంకు చెందిన యాట నాగరాజుకు రూ. 15 వేలను ట్రస్ట్ ప్రతినిధులు జీండ్రు అంజిరెడ్డి, ఎంఏ ఖయ్యూం, నల్ల నరసింహ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిక్కా నరసింహ, మాజీ సర్పంచులు గుండు మల్లయ్య, సుర్వి నరసింహ, ఊదరి నరసింహ, నల్ల నరేందర్ రెడ్డి, చెన్నగొని అంజయ్య, సంజీవరెడ్డి, భీమిడి ప్రదీప్ జీ, బొడిగే ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply