Rajender Goud | సేవకుడిగా పని చేస్తా..

Rajender Goud | సేవకుడిగా పని చేస్తా..
Rajender Goud | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించండి.. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె.రాజేందర్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ లో బుధవారం రోజు గ్రామంలో తన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే.. గ్రామాభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానని అన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. స్థానిక సమస్యలన్నీంటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధిస్తానని పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతుదారులతో ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య గౌడ్, గోపాల్ గౌడ్, వెంకటయ్య, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
