Rajapet | సర్పంచ్‌గా గెలిపిస్తే…

Rajapet | రాజాపేట, ఆంధ్రప్రభ : ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తానని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పల్లె సంతోష్ గౌడ్ అన్నారు. కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. రఘునాథపురం గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని.. వాడవాడలా ప్రచారం చేస్తూ.. ప్రజలతో మమేకమయ్యారు. ఈసారి ఎన్నికల్లో పల్లె సంతోష్ గౌడ్ గెలుపు పక్కా అని.. ప్రజలే ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటేస్తే.. కష్టాలని తీరుస్తానని ఆయన మాటిస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తానని, రోడ్లను, మురికి కాల్వలను మరమ్మత్తు చేయించి అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మహిళల, యువత అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తానని.. పరిపాలకునిగా కాకుండా సేవకునిగా అంకితభావంతో పని చేస్తాననితెలిపారు. అవసరమైనప్పుడు వైద్య శిబిరాలని ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్తానని వరాల జల్లు కురిపించారు.
