AP | వర్షంతో.. రైతుల కన్నీళ్లు.!
పెడన, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా (Krishna district) లోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షం (Rain) రైతులకు కష్టాన్ని మిగిలిచ్చింది. ఇప్పటికే కోతకోసి రోడ్డుపై చేర్చిన ధాన్యం బస్తాలు ఈ వర్షంతో తడిచి ముద్దయ్యాయి. పంట చేతికి వచ్చిందని సంతోషించిన రైతులు ఇప్పుడు వర్షం వల్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ధాన్యం తడవడంతో నాణ్యత తగ్గి, మార్కెట్లో తక్కువ ధర లభించే అవకాశం ఉందని రైతులు (farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెడన నియోజకవర్గంలో పలువురు రైతులు నిర్వహించిన ధాన్యంపై వర్షం కురవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

