కౌంటింగ్ కు వర్షం దెబ్బ.. ఫలితాలపై జనం ఆసక్తి
నర్సాపురం, ఆంధ్రప్రభ: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంగళవారం చేపట్టిన కౌంటింగ్ కేంద్రం వద్ద వర్ష ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా జన జీవనం ఇంటికే పరిమితి అయ్యారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వెలవెలబోయింది. స్థానిక వైఎన్ కళాశాలలో చేపట్టిన ఈ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8గంటలు నుంచి ప్రారంభం అయ్యింది. ఏడు గంటలకే ఎన్నికల సిబ్బంది జోరు వానలో తడుసుకొంటూ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి కౌంటింగ్ ప్రక్రియ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎటువంటి ఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
కౌంటింగ్ కేంద్రం లో ఓట్లు లెక్కింపునకు 18టేబుల్స్ ను ఏర్పాటు చేశారు.నాలుగు రౌండ్ల లో కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. తొలి రెండు రౌండ్లు కౌన్సిలర్లు, మరో రెండు రౌండ్ లలో చైర్మన్ ఓట్లు లెక్కింపు జరుగనుంది. ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి తెలిపారు.
కౌంటింగ్ ప్రక్రియ కు ఏర్పాటు చేసిన రెండు కౌంటింగ్ కేంద్రాలలో మొదటి కేంద్రం లో అయిదు బెంచ్ లు, రెండో కేంద్రం లో 13 బెంచ్ లలో ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ కు 25మంది సూపర్వైజర్ లు , 86మంది కౌంటింగ్ అసిస్టెంట్ లు , నలుగురు మైక్రో అబ్జర్వర్స్ ను నియమించారు. కౌంటింగ్ కేంద్రం లో అభ్యర్థులతో బాటు ఒక ఏజెంట్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు . మొదటగా కౌన్సిలర్ ఫలితాలు, చివరిగా చైర్మన్ ఫలితం వెల్లడి చేయనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు..
నరసాపురం మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడయ్యాయి.
చైర్పర్సన్ పదవికి జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో మొత్తం 18 ఓట్లు పోలయ్యాయి.
- జనసేన అభ్యర్థి కొత్తపల్లి శైలజ – 12 ఓట్లు
- వైసీపీ అభ్యర్థి కావలి రామసీత – 4 ఓట్లు
- కాంగ్రెస్ అభ్యర్థి సంతోషి కుమారి – 2 ఓట్లు వచ్చాయి.
36వ వార్డు పోస్టల్ బ్యాలెట్ వివరాలు:
36వార్డులకు సంబంధించి మొత్తం 18 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి.
- జనసేన – 7 ఓట్లు
- టీడీపీ – 6 ఓట్లు
- వైసీపీ – 4 ఓట్లు
- చెల్లని ఓటు – 1
మొత్తం 18 ఓట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
