కలత చెందిన మాజీ మంత్రి
(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : పీసీసీ మాజీ అధ్యక్షుడు (Former President of PCC), మాజీ మంత్రి రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) కంటతడి పెట్టారు. తన మిత్రుడు, ఆప్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గుండెపోటు (Heart Attack)తో హఠాన్మరణం చెందారు. తోటలో పనిచేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి చేర్చేలోపే ఆయన మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రఘువీరా ఆయన నివాసానికి వెళ్లి.. అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు. భాస్కర్ రెడ్డి సతీమణి తోపుదుర్తి కవిత గతంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ (Zilla Parishad Chairperson) పనిచేశారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన ( former MLA Bhumana)కు కవిత సోదరి. వివాదరహితుడుగా ఉన్న భాస్కర్ రెడ్డి మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.

