కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

14 మంది సీనియర్ విద్యార్థుల‌పై వేటు!
నలుగురికి ఆరు నెలలు.. మరో పది మందికి నాలుగు నెలల సస్పెన్షన్‌
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
కామారెడ్డి జిల్లాలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తుంది. జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారని జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కమిషన్ కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితుల ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు. మెడికల్ కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు 14 మంది జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు గుర్తించారు. వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నలుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెన్షన్ చేశారు. పదిమంది విద్యార్థులను నాలుగు నెలల పాటు సస్పెన్షన్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో 14 మంది విద్యార్థులు ర్యాగింగ్ చేయడం కలకలం సృష్టిస్తుంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారని బాధితులు నేషనల్ మెడికల్ కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ర్యాగింగ్ కు పాల్పడిన 14 మంది విద్యార్థులను గుర్తించారు. వారిపై చర్యలు చేపట్టారు. వీరిలో నలుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెన్షన్ చేయగా, మరో 10 మంది విద్యార్థులను నాలుగు నెలల పాటు సస్పెన్షన్ చేశారు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, అధికారులు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరింత విచారణ చేపడుతున్నారు.