క్వాలిటీ బేకరీకి రూ.5 వేల జరిమానా

బూజు పట్టిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని క్వాలిటీ బేకరీకి శనివారం మున్సిపల్‌ అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. బేకరీలో బూజు పట్టిన (ఫంగస్‌) ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని మోత్కూర్‌కు చెందిన వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు మున్సిపల్‌ అధికారులు బేకరీని తనిఖీ చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించిన అనంతరం నిర్వాహకులకు రూ.5 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.