Puppetry | కథ చెప్పడం ఒక కళ..

  • గచ్చిబౌలిలో పప్పెట్రీ వర్క్‌షాప్‌
  • వాయిస్ మాడ్యులేషన్, స్టోరీ టెల్లింగ్‌పై శిక్షణ

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ (CCRT), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్వహించిన పప్పెట్రీ (Puppetry) వర్క్‌షాప్ లో స్టోరీ టెల్లింగ్, వాయిస్ మాడ్యులేషన్‌పై ప్రత్యేక శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ లైఫ్ స్కిల్స్ కోచ్, వెంట్రిలాక్విజం కళాకారుడు జివిఎన్ రాజు పాల్గొని, పాల్గొనేవారికి పప్పెట్రీలో పాత్రలకు తగ్గట్టుగా వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలో వివరించారు.

అలాగే, ఒక టీచర్‌కి అవసరమైన వాయిస్ మాడ్యులేషన్ పద్ధతులు, కథ చెప్పే విధానంలో భావవ్యక్తీకరణను ఎలా పెంపొందించుకోవాలో కూడా ప్రాక్టికల్ డెమోస్‌తో శిక్షణ ఇచ్చారు.

జివిఎన్ రాజు మాట్లాడుతూ… “కథ చెప్పే కళలో వాయిస్, ఎక్స్ప్రెషన్, ఎమోషన్ మూడు సమతుల్యంగా ఉంటేనే పప్పెట్రీ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు” అని అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో టీచర్లు, ఆర్టిస్టులు, కల్చరల్ ట్రైనర్లు పాల్గొన్నారు.

Leave a Reply