SRH vs PBKS | పంజాబ్ వీరంగం.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ !

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌‌హెచ్‌తో జ‌రుగుతున్న‌ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన‌ పంజాబ్ జట్టు.. ఎస్ఆర్‌‌హెచ్ బౌల‌ర్ల‌ను బౌండ‌రీల‌తో బెంబేలెత్తించింది. బ్యాట‌ర్లు వీరవిహారం చేయ‌డంతో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.

టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు, ప్రియాంష్ ఆర్య (13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36), ప్రభమన్ సింగ్ (23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో 42) దంచికొట్టాగా.. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ (36 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సుల‌తో 82) వైల్డ్ ఫైర్ ఇన్నింగ్ తో ఆరెంజ్ ఆర్మీకి చుక్కలు చూపించాడు. మిడిల్ ఆర్డర్‌లో శశాంక్ సింగ్ (2), గ్లెన్ మాక్స్‌వెల్ (3) విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. ఆఖ‌ర్లో మార్కస్ స్టోయినిస్ (11 బంతుల్లో 34) విధ్యంసం సృష్టించాదు.

హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీసి పంజాబ్ జట్టు దూకుడును కొంతవరకు అదుపు చేశాడు. ఇషాన్ మలింగ రెండు వికెట్లు ద‌క్కించుకున్నాడు.. దీంతో 246 ప‌రుగుల భారీ టార్గెట్ తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఛేజింగ్ కు దిగ‌నుంది.

Leave a Reply