Pulse Polio Program | రెండు చుక్క‌ల‌తో ఆరోగ్య భ‌విత

Pulse Polio Program | రెండు చుక్క‌ల‌తో ఆరోగ్య భ‌విత

  • ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

Pulse Polio Program | ఆంధ్రప్రభ, విజయవాడ : రెండు చిన్న పోలియో చుక్క‌లు ఆరోగ్య‌క‌ర‌మైన భ‌విత‌కు బాట‌లు వేస్తాయ‌ని.. సుసంప‌న్న‌, ఆరోగ్య‌, ఆనంద‌క‌ర ఆంధ్రా ల‌క్ష్యాల సాధ‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మంలో భాగంగా క‌లెక్ట‌ర్ ఆదివారం న‌గ‌రంలోని చుండూరు వెంక‌ట‌రెడ్డి న‌గ‌ర‌పాల‌క సంస్థ ఉన్న‌త పాఠ‌శాల వ‌ద్ద పోలియో బూత్‌ను సంద‌ర్శించారు. చిన్నారుల‌కు స్వ‌యంగా పోలియో చుక్క‌లు వేశారు. రోటరీ నగర్, హెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో కూడా పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Pulse Polio Program

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల‌ను చేరుకునే క్ర‌మంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి స‌మ‌ష్టి కృషి జ‌రుగుతోంద‌ని, పోలియోను అంత‌మొందించిన‌ప్ప‌టికీ అప్ర‌మ‌త్తంగా ఉంటూ అయిదేళ్ల‌లోపు చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. త‌ల్లిదండ్రులు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా త‌ప్ప‌కుండా చిన్నారుల‌కు పోలియో డ్రాప్స్ వేయించాల‌ని తెలిపారు. ఈ నెల 22, 23వ తేదీల్లో ఇంటింటి స‌ర్వే ద్వారా కూడా మిగిలిపోయిన చిన్నారుల‌కు పోలియో చుక్క‌లు వేయడం జ‌రుగుతుంద‌న్నారు.

జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తోపాటు డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, డీఐవో డా.శ‌ర‌త్‌బాబు, విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి కూడా ప‌ల్స్ పోలియో కార్య‌క్రమంలో పాల్గొన్నారు. కార్య‌క్ర‌మ విజ‌య‌వంతానికి అధికారులు, సిబ్బందికి సూచ‌న‌లు చేశారు.

Leave a Reply