Public service | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

Public service | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

Public service | టేకుమట్ల, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థ ఎన్నికల్లో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కలికోటపల్లి నూతన గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నాగుల వనిత నరేందర్ బరిలో ఉన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు ఓటెయ్యాలని వారు కోరారు. ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

బ్యాట్ గుర్తుకు ఓటెయ్యాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి ఇంటి ఆడబిడ్డల ప్రజాసేవ(public service) చేస్తానని తెలిపారు. సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే, ప్రజాసేవకు అంకితం అవుతానని, ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు.

రోడ్డు మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మత్తులు చేయిస్తానని ఆమె తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ(government) సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి అవకాశం కల్పిస్తే నాణ్యమైన పరిపాలన ప్రజలందరికీ అందిస్తానని ఆమె భరోసా కల్పించారు. ఖచ్చితంగా ప్రజలంతా బ్యాట్ గుర్తుకు ఓటేసి నాగుల వనిత నరేందర్ ను గెలిపించాలని వారు కోరారు

Leave a Reply