ఆర్థిక సహాయం అందజేత..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన గుర్రం యాదమ్మ(68) అనారోగ్యంతో ఈరోజు మృతి చెందింది.విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూ.5వేల రూపాయలు,మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం రూ.5 వేల రూపాయలు,సర్పంచ్ నామని జగన్నాథం క్వింటల్ బియ్యం, వార్డు సభ్యులు భావండ్ల శ్రీనివాస్ 50 కేజీల బియ్యం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరందాసు రాములు,నామని బుచ్చయ్య,చెరుపల్లి సత్తయ్య,చెరుపల్లి ఆంజనేయులు,రాపోలు మార్కండేయ,బొల్ల రాములు,గంజి కృష్ణయ్య, కర్నాటి వెంకటేశం,గంజి పరంధాములు,గంజి పెద్దులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply