నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ
నాగర్ కర్నూల్ ఆంధ్రప్రభ : పెన్షనర్ల అపరిష్కరుత సమస్యల సాధనకు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే భారీ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాగర్కర్నూల్ శాఖ చే వారి కార్యాలయంలో ఆవిష్కరించినారు. ఈ సందర్భంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రసంగిస్తూ రాష్ట్ర సంగం పిలుపుమేరకు అందరు విశ్రాంత ఉద్యోగులు పాల్గొని మన సమస్యల సాధనకు చేయూత నివ్వాలని తెలిపారు, ఈ కార్యక్రమం లో జిల్లా కోశాధికారి వెంకటశెట్టి, మండల అధ్యక్షులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, భాస్కర్ రావు,పోలా శ్రీనివాసులు, వెంకటరాజ,శ్రీనివాసులు, శ్రీనివాసులు, స్వామి రావు తది తరులు పాల్గొన్నారు.
