Breaking News | సెక్రటేరియట్ వద్ద ఆందోళన.. బీజేపీ నేతల అరెస్ట్..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల కోసం బీజేపీ ఆందోళన
ఎంపీ డీకే అరుణ, మహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నేతల అరెస్ట్‌


Breaking News | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సెక్రటేరియట్‌ ముట్టడికి యత్నించారు.

ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీ ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు పేర్కొన్నారు.